: పిజ్జా తినాలంటే అక్కడ 5 కి.మీ, బర్గర్ తినాలంటే 4 కి.మీ రన్నింగ్ చేయాల్సిందే!

పోర్చుగల్ వాసులకి పిజ్జా, బ‌ర్గ‌ర్‌లు తినాల‌నిపిస్తే వారు నాలుగు కిలో మీటర్ల‌కు పైగా న‌డ‌వాలి లేదా ప‌రుగులు తీయాలి. అయితే వారు ప‌రుగుతీయాల్సింది ఫాస్ట్‌ఫుడ్ సెంట‌ర్ వైపు కాదు. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం కోసం ప్ర‌త్యేకంగా ప‌రుగెత్తితే వారి చేతిలో పిజ్జా, బ‌ర్గ‌ర్ ఉచితంగా ప‌డుతుంది. పోర్చుగ‌ల్‌లో విప‌రీతంగా పెరిగిపోతోన్న ఊబ‌కాయం స‌మ‌స్య‌కు అడ్డుక‌ట్ట వేయ‌డానికి ఆ దేశంలోని లిస్బన్‌లో టాగస్‌ నది తీరంలో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. పోర్చుగ‌ల్ వాసులు పిజ్జా తినాలంటే 5 కిలోమీటర్లు, బర్గర్ తినాలంటే 4 కిలోమీటర్లు, సాస్ కోసం 500 మీటర్లు వాకింగ్‌ లేదా రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. ఒబేసిటీ గ్రూపుకు చెందిన ‘అడెక్సో’ సంస్థ వారిలో ఊబ‌కాయాన్ని త‌గ్గించడానికి ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. వాకింగ్ లేదా ర‌న్నింగ్‌తో ప్ర‌జ‌లు ఆరోగ్యంగా ఉంటార‌ని అందుకే ఈ ప‌ద్ధ‌తికి శ్రీ‌కారం చుట్టామ‌ని ‘అడెక్సో’ నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఉత్సాహంగా పాల్గొంటూ ఉచితంగా పిజ్జాను పొందడంతో పాటు వారి ఆరోగ్యాన్నీ కాపాడుకుంటున్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌డానికి వీడియో, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల ద్వారా విద్యాసంస్థ‌ల్లో ప్ర‌చారం చేయ‌నున్న‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌జ‌లంద‌రికీ అవ‌గాహ‌న క‌ల్పించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెబుతున్నారు.

More Telugu News