: 'బంగాళదుంపలు, ఉల్లి' స్నేహం ఇండియాతో వద్దు, బాలీవుడ్ ను బ్యాన్ చేయండి: హఫీజ్ సయీద్ సంచలన వ్యాఖ్యలు

ఇండియాతో కొనసాగిస్తున్న అన్ని రకాల వాణిజ్య బంధాలకు పాక్ తక్షణం స్వస్తి పలకాలని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ డిమాండ్ చేశాడు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వానీ ఎన్ కౌంటర్ ను ప్రస్తావిస్తూ, హఫీజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "ఇండియాతో బంగాళదుంపలు, ఉల్లిపాయల వాణిజ్యం వద్దు. భారత్ లోని అంబాసిడర్ ను వెంటనే వెనక్కి పిలిపించాలి. పాక్ లో భారత చిత్రాల ప్రదర్శనను నిషేధించాలి. కాశ్మీరులో హత్యలతో పాక్ ప్రజల సెంటిమెంటును భారత్ దెబ్బతీస్తోంది. ఆ దేశానికి గట్టి జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది" అని అన్నాడు. కాగా, హఫీజ్ తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్ లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో తరచూ పర్యటిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈ కరుడుగట్టిన ఉగ్రవాది అసలు తమ దేశంలోనే లేడని పాక్ బుకాయిస్తూ వస్తోంది.

More Telugu News