: హిల్లరీ క్లింటన్ ను మూడున్నర గంటల పాటు విచారించిన ఎఫ్బీఐ

తన ప్రైవేటు ఈ-మెయిల్స్ ద్వారా రహస్యంగా ఉంచాల్సిన అధికారిక సమాచారాన్ని బట్వాడా చేశారన్న ఆరోపణలపై డెమోక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడనున్న హిల్లరీ క్లింటన్ ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) అధికారులు విచారించారు. ఈ విషయాన్ని హిల్లరీ ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్న నిక్ మెర్రిల్ తెలిపారు. ఆమె అధికారిక హోదాలో ఉన్న సమయంలో పంపిన ఈ-మెయిల్స్ విషయంలో హిల్లరీ స్వయంగా ఎఫ్బీఐ ముందు హాజరయ్యారని తెలిపారు. విచారిస్తున్న అధికారులపై తమకు గౌరవం ఉందని తెలిపారు. విచారణ సందర్భంగా హిల్లరీ ఏం చెప్పారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా, ఎఫ్బీఐ హెడ్ క్వార్టర్స్ లో మొత్తం మూడున్నర గంటల పాటు హిల్లరీని విచారించిన అధికారులు పలు ప్రశ్నలను సంధించినట్టు తెలుస్తోంది.

More Telugu News