: తక్కువ ధరలో లభించే ఆక్టా-కోర్ ప్రాసెసర్లున్న స్మార్ట్ ఫోన్లివి!

ఓ స్మార్ట్ ఫోన్లో ప్రాసెసర్ లో ఎన్ని 'కోర్'లు ఉంటే అది అంత మెరుగైన వేగాన్ని, మల్టీ టాస్కింగ్ పనితీరును చూపుతుందన్న విషయం తెలిసిందే. తొలుత ఉన్న సింగిల్ కోర్ ప్రాసెసర్ల నుంచి, డబుల్, క్వాడ్-కోర్ ప్రాసెసర్లున్న ఫోన్లు పోయి, ఆక్టా-కోర్ (8) ప్రాసెసర్లు ఇప్పుడు రాజ్యమేలుతున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 15 వేల కన్నా తక్కువ ధరలో లభిస్తున్న ఆక్టా-కోర్ ప్రాసెసర్లున్న ఫోన్ల వివరాలివి. మోటో జీ4 ప్లస్; ధర రూ. 14,999: జీ సిరీస్ లో మోటరోలా ఆవిష్కరించిన తాజా ఫోన్ ఇది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్, 3 జీబీ ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్లు దీని ప్రత్యేకత. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ప్రో 6; ధర రూ. 13,999: 'నట్స్, గట్స్, గ్లోరీ' అనే ట్యాగ్ లైన్ తో మైక్రోమ్యాక్స్ దీన్ని విడుదల చేసింది. 2 జీహెచ్ఎస్ మీడియా టెక్ హెలియో ఎస్ఓసీ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకత. లెనోవో వైబ్ కే5 ప్లస్; ధర రూ. 8,499: ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఫోన్లలో తక్కువ ధరకు లభించే ఫోన్ గా దీన్ని చెప్పుకోవచ్చు. అడ్రినో 405 జీపీయూ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 415 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్ వంటి పవర్ ఫుల్ స్పెసిఫికేషన్లతో లభిస్తుంది. యూ యునీకార్న్; ధర రూ. 12,999: మైక్రోమ్యాక్స్ అనుబంధ 'యూ' ఇటీవల విడుదల చేసిన ఫోన్ ఇది. 4 జీబీ ర్యామ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, మీడియా టెక్ ఎంటీ 6755 ప్రాసెసర్లు దీన్ని మరింత ఆకర్షణీయం చేశాయి. గేమింగ్ అనుభూతిని మరింతగా కోరుకునేవారికి సరిగ్గా నప్పే స్మార్ట్ ఫోన్ ఇది. కూల్ ప్యాడ్ నోట్ 3 ప్లస్; ధర రూ. 8,999: అందుబాటు ధరకు లభించే మరో క్వాడ్-కోర్ ప్రాసెసర్ తో వచ్చే ఫోన్ ఇది. 1.3 జీహెచ్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ దీని ప్రత్యేకతలు. హెచ్టీసీ డిజైర్ 626జీ; ధర రూ. 9,578: 1 బీజీ ర్యామ్ లోనే ఆక్టా-కోర్ ప్రాసెసర్ ను జోడించుకున్న ఫోన్ ఇది. 16 జీబీ స్టోరేజ్ తో లభించే ఫోన్ పనితీరు బాగుందన్న సమీక్షలు దీన్ని ఆకర్షణీయం చేశాయి. ఆసూస్ జన్ ఫోన్ మ్యాక్స్; ధర రూ. 9,999: ఇటీవలే విడుదలైంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్, 32 గిగాబైట్ల మెమొరీతో లభించే ఈ ఫోన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఈవోక్; ధర రూ. 8,499: కాన్వాస్ ఈవోక్ సిరీస్ లో తొలి ఫోన్ ఇది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 415 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 16 జీబీ మెమొరీలు ఉన్నాయి. వీటిని వాడితే మరింత స్మార్ట్ ఫోన్ అనుభూతిని పొందవచ్చని విశ్లేషకుల సలహా.

More Telugu News