: 2012 నుంచి ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాను!: కోహ్లీ

బ్యాటింగ్, ఫీల్డింగ్ లో రాణించడానికి కారణం ఫిట్ నెస్సేనని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, కెరీర్ ఆరంభంలో ఫిట్ నెస్ గురించి పెద్దగా పట్టించుకోలేదని అన్నాడు. దీంతో తన పూర్తి సామర్థ్యం ప్రదర్శించలేకపోయానని కోహ్లీ చెప్పాడు. 2012 ఐపీఎల్ తరువాత ఫిట్ నెస్ ప్రాధాన్యత గుర్తించి, దానిపై దృష్టి పెట్టానని చెప్పాడు. అప్పటి నుంచీ ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ తయారు చేసుకుంటున్నానని తెలిపాడు. ఏం తినాలి? ఎంత వర్కవుట్ చేయాలి? ఏ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి? వంటి విషయాలన్నీ క్రమబద్ధంగా పాటిస్తున్నానని అన్నాడు. ఆ తరువాత పూర్తి సామర్థ్యంతో ఆడగలుగుతున్నానని, మంచి బ్యాట్సమన్, ఫీల్డర్ వంటి కితాబులందుకుంటున్నానని చెప్పాడు. ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ ను సంతరించుకోవాలనుకుంటే కనుక క్రమశిక్షణ పాటించాలని సూచించాడు.

More Telugu News