: కెప్టెన్ కూల్ రికార్డుల పరంపర!... అత్యధిక మ్యాచ్ ల సారధిగా పాంటింగ్ రికార్డు సమం!

టీమిండియా పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట వరుసగా రికార్డులు నమోదవుతున్నాయి. 2007లో అనూహ్య పరిస్థితుల మధ్య టీమిండియా జట్టు సారధ్య బాధ్యతలు చేపట్టిన మహీ... ఆ బాధ్యతలను సుదీర్ఘ కాలంగా మోస్తూనే వస్తున్నాడు. ఇటీవలే టెస్టు జట్టు కెప్టెన్సీ పగ్గాలు యువ సంచలనం విరాట్ కోహ్లీకి అప్పగించిన ధోనీ... వన్డే, టీ20 ఫార్మాట్ల జట్లకు అతడే కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో విజయం సాధించిన ధోనీ సేన కప్ ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్ తో ధోనీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యధిక మ్యాచ్ లకు సారధ్యం వహించిన కెప్టెన్ గా ధోనీ రికార్డు పుటలకెక్కాడు. ఇప్పటిదాకా ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ పేరిట ఉంది. తాజాగా రికీ రికార్డును ధోనీ సమం చేశాడు. మొత్తం 324 మ్యాచ్ ల్లో టీమిండియాకు ధోనీ సారధ్యం వహించాడు. వీటిలో 60 టెస్టులు, 194 వన్డేలు, 70 టీ20 మ్యాచ్ లున్నాయి.

More Telugu News