: ‘ఫోర్బ్స్’ పవర్ ఫుల్ మహిళల జాబితాలో భారత్ సత్తా!... నలుగురు భారత నారీలకు చోటు!

ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళలంటూ వంద మంది పవర్ ఫుల్ లేడీస్ తో ప్రముఖ మేగజీన్ ‘ఫోర్బ్స్’ విడుదల చేసిన జాబితాలో భారత్ సత్తా చాటింది. మొత్తం వంద మంది మహిళల్లో నలుగురు భారత నారీలకు చోటు దక్కింది. వీరిలో దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఉన్న అరుంధతీ భట్టాచార్య ముందు వరుసలో నిలిచారు. మొత్తం జాబితాలో 25వ స్థానంలో నిలిచిన భట్టాచార్య... భారత మహిళల్లో తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ సీఈఓ చందా కొచ్చార్ ఈ జాబితాలో 40వ స్థానంలో నిలిచారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 77వ స్థానంలో నిలవగా, ‘హిందూస్థాన్ టైమ్స్’ పత్రికను ప్రచురిస్తున్న ‘హెచ్ టీ మీడియా’ శోభనా భార్తియా 93 వ స్థానంలో నిలిచారు.

More Telugu News