: భార్యకు గిఫ్ట్ ఇచ్చేందుకు సెకెండ్ హ్యాండ్ కారు కొన్న బ్రిటన్ ప్రధాని

భార్యకు గిఫ్ట్ ఇచ్చేందుకు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేయడం ఆసక్తిరేపుతోంది. వినూత్నమైన పంథా అనుసరిస్తూ, ప్రజల్లో కలిసిపోయే ప్రధాని డేవిడ్ కామెరాన్ సొంత నియోజకవర్గం మినిస్టర్ లోవెల్ లోని ఓ సెకండ్ హ్యాండ్ కార్ల దుకాణంలో నిస్సాన్ మైక్రా బ్లూకారు 2004 మోడల్ కారును చూశారు. తనకు బాగా నచ్చడంతో దానిని తన భార్యకు గిఫ్ట్ గా ఇవ్వాలని భావించారు. దీంతో 1,495 ఫౌండ్లు వెచ్చించి, దానిని ఆయన కొనుగోలు చేశారు. దీనిపై ఈ సెకెండ్ హ్యాండ్ కార్ల షాపు ఓనర్ లేయిన్ హ్యారీస్ మాట్లాడుతూ, తనకు ఒక ఫోన్ వచ్చిందని, తన దుకాణంలోని కారును చూసేందుకు ప్రధాని కామెరాన్ వస్తున్నారని దాని సారాంశమని అన్నారు. అయితే తన సహచరుల్లో ఎవరో తనని ఆటపట్టించేందుకు ఇలా ఫోన్ చేశారని భావించానని ఆయన చెప్పారు. ఫోన్ లో చెప్పినట్టే ప్రధాని కామెరాన్ రావడాన్ని నమ్మలేకపోయానని ఆయన తెలిపారు. ఆయన సాధారణ కొనుగోలుదారులా అరగంటపాటు కారును చూసి, డీటెయిల్స్ కనుక్కున్నారని ఆయన చెప్పారు.

More Telugu News