: 200 పాయింట్ల రికవరీ వచ్చినా నష్టాల్లోనే!

యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి సమావేశాల్లో వడ్డీ రేట్లను పెంచనుందని వచ్చిన వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీయగా, సెషన్ ఆరంభంలోనే భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లోకి జారిపోయింది. ఒకదశలో 25,500 పాయింట్లకు పడిపోయిన సెన్సెక్స్, ఆపై వచ్చిన కొనుగోలు మద్దతుతో 200 పాయింట్లకు పైగా రికవరీని నమోదు చేసినప్పటికీ, లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది. స్మాల్ క్యాప్ సెక్టార్ మాత్రమే 0.22 శాతం లాభాల్లో కొనసాగింది. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 69 పాయింట్లు పెరిగి 0.27 శాతం నష్టంతో 25,704.61 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 20.60 పాయింట్లు పడిపోయి 0.26 శాతం నష్టంతో 7,890.75 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.01 శాతం నష్టపోగా, స్మాల్ కాప్ 0.22 శాతం లాభపడింది. ఇక, ఎన్ఎస్ఈ-50లో 21 కంపెనీలు లాభపడ్డాయి. ఎస్బీఐ, ఓఎన్జీసీ, లుపిన్, లార్సెన్ అండ్ టూబ్రో, హెచ్సీఎల్ టెక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, బోష్ లిమిటెడ్, జడ్ఈఈఎల్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,737 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,128 కంపెనీలు లాభాలను, 1,319 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం నాడు రూ. 97,47,662 కోట్లుగా ఉన్న బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 97,45,007 కోట్లకు తగ్గింది.

More Telugu News