: సన్నీలియోన్ దంపతులను సర్ ప్రైజ్ చేసిన బెంగళూరు హోటల్

పూర్వాశ్రమంలో కెనడాలో అడల్ట్ వీడియోల్లో నటించి... గత కొన్నాళ్లుగా భారత్ లో సినీ నటిగా పేరుతెచ్చుకున్న సన్నీలియోన్ దంపతులను బెంగళూరు హోటల్ ఒకటి సంభ్రమాశ్చర్యంలో మునిగి తేలేలా చేసింది. 'వన్ నైట్ స్టాండ్' సినిమా ప్రమోషన్ లో పాల్గొనేందుకు సన్నీలియోన్, ఆమె భర్త డేనియల్ వెబర్ బెంగళూరు వెళ్లారు. అక్కడ వారు బస చేయాల్సిన హోటల్ కు చేరుకునే సరికి హోటల్ యాజమాన్యం వారిని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే ఆహ్వానం పలికింది. వారి పెళ్లి రోజని తెలిసిన హోటల్ యాజమాన్యం ఇద్దరి చేతా దండలు మార్పించింది. కేక్ కట్ చేయించింది. వారి కోసం గుర్రపు బగ్గీ ఏర్పాటు చేసి, అందులో తిప్పింది. తమను ఆశ్చర్యానందంలో మంచెత్తిన హోటల్ యాజమాన్యానికి సన్నీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News