: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్...రెండు వరుస బంతుల్లో ప్రాణదానం

టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ బ్యాట్స్ మన్ అభిమానులను ఆందోళనకు గురి చేశాడు. ఏడవ ఓవర్ రెండో బంతికి రోహిత్ శర్మ (43) అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీకి వాంఖడేలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. నూరుకోట్ల భారతీయ క్రికెట్ అభిమానుల ఆశలు మోస్తూ క్రీజులోకి వచ్చిన కోహ్లీ 8వ ఓవర్ లో మూడవ బంతిని బౌన్సర్ గా ఎదుర్కొన్నాడు. ఈ బంతిని అంపైర్ నోబాల్ గా ప్రకటించడంతో కోహ్లీ సిక్సర్, లేదా ఫోర్ కొడతాడని అంతా ఆశించారు. అయితే బ్రావో బంతిని తెలివిగా సంధించడంతో కోహ్లీ కనీసం బీట్ చేయలేదు. అయినప్పటికీ పరుగు కోసం ముందుకు ఉరికాడు. బంతిని ఒడిసిపట్టుకున్న దినేష్ రాందిన్ వికెట్లకు విసిరాడు. అది గురితప్పి బ్రావో చేతుల్లో పడింది. బ్రావో కూడా వికెట్లకు గురిచూసి బంతిని విసిరాడు. అది కూడా గురితప్పింది. ఇంతలో కోహ్లీ క్రీజులోకి చేరుకున్నాడు. తరువాతి బంతికి ఒత్తిడి ఫీలైన కోహ్లీ బాల్ ను టచ్ చేసి పరుగుకు వచ్చాడు. మిడ్ వికెట్ లో ఉన్న ఫీల్డర్ దానిని గురి చూసి విసిరాడు. అది కూడా వికెట్లకు కొద్ది దూరంలోంచి వెళ్లింది. దీంతో వరుస బంతుల్లో కోహ్లీ ప్రాణదానం పొందాడు. దీంతో పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 86/1

More Telugu News