: పర్యావరణానికి శాకాహారంతోనే ఎక్కువ హాని!: పరిశోధకులు

మాంసాహారంతో పోలిస్తే శాకాహారం వినియోగం వల్లే పర్యావరణంలో ఎక్కువ మార్పులు సంభవించడానికి అవకాశముందని పరిశోధకులు తెలిపారు. కార్నెజ్ మెలాన్ యూనివర్శిటీ (సీఎంయు)కి చెందిన పరిశోధకులు తాజా అధ్యయనం ఒకటి ఇటీవల నిర్వహించారు. పండ్లు, కూరలు, పాల ఉత్పత్తులు, సీ ఫుడ్ ల ను వినియోగించడం వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని జరుగుతుందని వీరి అధ్యయనంలో తేలింది. ఆయా ఆహార పదార్థాల ఉత్పత్తికి గాను వనరుల వినియోగం, వాటి ద్వారా ఉద్గారమయ్యే గ్రీన్ హౌస్ వాయువులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. ‘పంది మాంసంతో పోలిస్తే లెట్యూస్ వంటి ఆకు కూరల నుంచి వెలువడే గ్రీన్ హౌస్ వాయువులు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మనం వినియోగించే కూరగాయలు, ముఖ్యంగా దోసకాయ, కొన్ని ఆకుకూరల కంటే పందిమాంసం, చికెన్ వంటి మాంసాహారం పర్యావరణానికి అంత హాని చేయవు’ అని ప్రొఫెసర్ పాల్ ఫిష్ బెక్ పేర్కొన్నారు.

More Telugu News