: మీ ఖాతాలను ప్రభుత్వం హ్యాక్ చేస్తుంది జాగ్రత్త: హెచ్చరించిన ట్విట్టర్

ప్రభుత్వ సంస్థలు, వాటి ప్రోద్బలంతో కొందరు ట్విట్టర్ ఖాతాలను హ్యాక్ చేసే ప్రమాదముందని ట్విట్టర్ హెచ్చరించింది. సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ ఈ తరహా హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు ఎంపిక చేసిన కొన్ని ఖాతాలకు ట్విట్టర్ యాజమాన్యం హెచ్చరికలు పంపింది. కెనడా సంస్థ కోల్ డాక్, తమకు హెచ్చరికలు అందాయని చెబుతూ, వాటిని రీ పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. "మీరు చిన్న గ్రూపుల్లో ఉన్నారు. ప్రభుత్వ ప్రాయోజిత శక్తులు మీ ఖాతాలను హ్యాక్ చేయవచ్చు. అందువల్ల ముందు జాగ్రత్తగా హెచ్చరిస్తున్నాం. మీ ఈ-మెయిల్, ఐపీ, ఫోన్ నంబర్లు వంటివి చోరీకి గురి కావచ్చు" అని పేర్కొంది. హ్యాకింగ్ పై విచారణ జరుపుతున్నామని, వెబ్ సైట్ భద్రతనూ పెంచుతున్నామని వెల్లడించింది.

More Telugu News