: 'ఫ్రెంచ్ ఫ్రైస్'లో కేన్సర్ ముప్పు కారకాలు!

నూనెలో బాగా వేయించిన పదార్థాలు ఆరోగ్యానికి హానికరమన్న విషయం అందరికీ తెలిసిందే. వాటిలో ముఖ్యంగా ఆలుగడ్డతో తయారు చేసే 'ఫ్రెంచ్ ఫ్రైస్' మరీ ప్రమాదమని పరిశోధకులు చెబుతున్నారు. ఇవి తింటే కేన్సర్ ముప్పును కొని తెచ్చుకున్నట్టే అవుతుందని వారి పరిశోధనలో తేలింది. అమెరికాలోని 'ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్'కు చెందిన సైంటిస్టులు స్థానికంగా పలు ప్రాంతాల్లో తయారు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ శాంపిల్స్ ను ఇటీవల పరిశీలించారు. అందులో కేన్సర్ కలిగించే వివిధ రకాల హానికర రసాయనాలు ఉన్నాయని, ఆ ముప్పును మరింత ఎక్కువ చేస్తాయని వెల్లడించారు. దాంతో పాటు నూనెలో బాగా వేయించిన ఆలూ చిప్స్ తినడం కూడా ప్రమాదమేనని ఆ సైంటిస్టులు చెబుతున్నారు.

More Telugu News