: ఒక్క రక్త పరీక్షతో బ్రెయిన్ స్ట్రోక్ ను కూడా పట్టేయొచ్చు!

ఒక్క రక్తపరీక్షతో వివిధ రకాల వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడే బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధులను కూడా పట్టేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే రక్త పరీక్షకు ఉపయోగించే గ్లాస్ స్థానంలో ఎంజైమ్స్ పూత కలిగిన ప్లేటును వినియోగిస్తారు. ఈ ప్లేట్లు వ్యాధులకు కారణమయ్యే రసాయనాలను రక్తంలో గుర్తిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ప్రాణాంతకమైన బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పును ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చని చెబుతున్నారు. అయితే స్కాన్ చేయకుండా చికిత్స తీసుకోవడం సరైన విధానం కాదని పలువురు వైద్యులు చెబుతున్నారు. పది నిమిషాల్లో స్ట్రోక్ ను గుర్తించే 'గేమ్ ఛేంజర్' గా ఈ పరీక్షను పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. 2018 నుంచి ఈ పరీక్ష అందుబాటులోకి రానుంది. మరిన్ని పరీక్షల అనంతరం దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

More Telugu News