: ముస్లింలు ఇక్కడుండాలంటే ఆవు మాంసం తినడం ఆపేయాల్సిందే: హర్యానా సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇప్పటికే రగులుతున్న గోమాంసం వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. భారత్ లో ముస్లింలు హాయిగా బతకొచ్చని... కాకపోతే, వారు ఇక్కడ ఉండాలంటే గోంమాంస భక్షణను వదిలేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. హిందువులకు గోవులు అత్యంత పవిత్రమైనవని... ముస్లింలు ఆవు మాంసం తింటే హిందువుల పవిత్రమైన భావాలను అవమానించినట్టేనని స్పష్టం చేశారు. మన ప్రజాస్వామ్య దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది... అయితే దానికీ ఓ హద్దు ఉంటుందని అన్నారు. దాద్రి ఘటనపై ఆయన స్పందిస్తూ, "ఆ ఘటన జరగడం దారుణమే, కానీ, గోమాతను ఉద్దేశించి ఇఖ్లాక్ అవమానకర వ్యాఖ్యలు చేసి స్థానిక హిందువులను రెచ్చగొట్టాడు. అందుకే ఆ ఘటన జరిగింది" అని ఖట్టార్ అన్నారు. దీనిపై లలూప్రసాద్ యాదవ్ సహా ముస్లిం నేతలు మండిపడ్డారు.

More Telugu News