నెల రోజుల్లోగా రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలి: సీఎం కేసీఆర్

15-10-2015 Thu 17:13

హైదరాబాద్ నగరంలో దెబ్బతిన్న రహదారులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. దెబ్బతిన్న రహదారుల జాబితాను తయారు చేయాలని, మరమ్మతులు, నిర్మాణ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేయాలని అన్నారు. ఇందుకోసం టెండర్లను పిలవాలని సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారుల గురించి కూడా కేసీఆర్ చర్చించారు. రాజధానిలో 1000 కిలోమీటర్ల మేరకు తారు రోడ్లు, 400 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో రోడ్ల మరమ్మతు పనుల కోసం రూ.500 కోట్లు ఖర్చవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పినట్లు సమాచారం.