క్రికెట్ దిగ్గజం లారా, బాలీవుడ్ తార పరిణీతి చోప్రాలతో కేటీఆర్ సెల్ఫీ ముచ్చట!

15-10-2015 Thu 07:39

స్మార్ట్ ఫోన్లతో ఇష్టమైన వ్యక్తులతో ఫొటోలు క్లిక్ మనిపిస్తున్న సెల్పీల జోరు నానాటికీ విస్తరిస్తోంది. ఈ ముచ్చటను సాధారణ పౌరుల నుంచి ప్రముఖుల దాకా ఏ ఒక్కరూ దాచుకోవడం లేదు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నిన్న ఓ సెల్ఫీ తీసుకున్నారు. ఎవరితోనో తెలుసా? క్రికెట్ దిగ్గజం బ్రయన్ లారా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాలతో. యప్ టీవీ నిన్న హైదరాబాదులో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి లారాతో పాటు పరిణీతి చోప్రా కూడా వచ్చింది. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ తన సెల్ ఫోన్ తో వారిద్దరితో కలిసి సెల్పీ తీసుకున్నారు. సాక్షాత్తు ఓ మంత్రి తమతో సెల్ఫీ తీసుకోవడంతో లారాతో పాటు పరిణీతి కూడా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు.