: లష్కర్ ఎ తోయిబా సొంత యాప్!... నవేద్ అరెస్టుతో వెలుగులోకి

ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కర్ ఎ తోయిబా తమ కార్యకలాపాలను రహస్యంగా నిర్వహించేందుకు సొంతంగా ఓ యాప్ తయారు చేసుకుంది. తోయిబాలో ఉన్న 20 మంది సైబర్ సెల్ ఉగ్రవాదులు ఈ యాప్ తయారు చేశారు. యాప్ ద్వారా ఫోన్ కాల్స్ చేసుకోవడం, ఎస్ఎమ్ఎస్ లు పంపుకోవడం చేసుకోవచ్చు. రెండు నెలల కిందట జమ్ము కశ్మీర్ లోని ఉధంపూర్ లో పట్టుపడిన పాక్ ఉగ్రవాది నవేద్ కూడా ఈ యాప్ నే ఉపయోగించాడట. అయితే అతను అరెస్టయ్యాక యాప్ గురించి వెలుగులోకి వచ్చిందని సమాచారం. దాని ద్వారా లష్కర్ ఎ తోయిబాకు సహకరిస్తున్న వారి వివరాలు ఎన్ఐఏ అధికారులకు తెలిశాయి. తరువాత కాశ్మీర్ లోయలో సంస్థ కమాండర్ అబూ ఖాసింకు సంబంధించిన వివరాలు కూడా సేకరించారు. ఈ యాప్ కు సంబంధించిన సర్వర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉందని చెబుతున్నారు.

More Telugu News