: ప్రైవేటు జెట్ విమానాలు ఎక్కడు, నేతలకు పెద్దగా తెలియదు... కానీ ప్రపంచంలోనే బెస్ట్ సీఈఓ ఇతనే!

ప్రపంచంలోని కంపెనీల్లో అత్యుత్తమ సీఈఓ ఎవరు? ఈ విషయంలో హార్వార్డ్ బిజినెస్ రివ్యూ వార్షిక ర్యాంకులను ప్రకటించింది. ఈ సంవత్సరం ఓ కొత్త వ్యక్తి ఈ ఘనతను దక్కించుకున్నాడు. మిగతా సీఈఓల మాదిరిగా అతను ప్రైవేటు జెట్ విమానాలు ఎక్కి పర్యటనలు చేయడు. అసలు చాలా మంది ప్రపంచ నేతలకు అతని గురించి తెలియదు కూడా. డెన్మార్క్ కేంద్రంగా నడుస్తున్న నోవో నార్డిస్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లార్స్ సోరెన్సన్ ఈ సంవత్సరం బెస్ట్ సీఈఓగా నిలిచాడు. మధుమేహానికి చికిత్స దిశగా పెద్దఎత్తున ఔషధాలు తయారు చేస్తున్న సంస్థను నడిపిస్తున్నాడు. ఆయన కంపెనీ, అటు మెరుగైన ఆర్థిక ఫలితాలతో పాటు, పర్యావరణ పరిరక్షణ, సాంఘిక అంశాలకూ ప్రాధాన్యతనిస్తోందని హార్వార్డ్ బిజినెస్ వెల్లడించింది. ఇన్సులిన్ ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ అందుబాటులోకి తెచ్చిన ఘనత ఆయనదేనని ఈ సందర్భంగా హార్వార్డ్ బిజినెస్ వ్యాఖ్యానించింది. కాగా, గత సంవత్సరం నంబర్ వన్ ర్యాంకులో ఉన్న అమేజాన్ సీఈఓ జెఫ్ బేజోస్, ఈ సంవత్సరం 87వ స్థానానికి పడిపోవడం గమనార్హం. టాప్-100 బెస్ట్ సీఈఓల జాబితాలో కేవలం ఇద్దరు మహిళలకు మాత్రమే స్థానం దక్కింది.

More Telugu News