: పండగల సందర్భంగా 117 ప్రత్యేక రైళ్లు

పండగల నేపథ్యంలో 117 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తాయన్నారు. దసరా, దీపావళి పండగల సందర్భంగా తమ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కల్గకుండా ఉండేందుకు ప్రత్యేక రైలు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు. అక్టోబరు 13 నుంచి నవంబర్ 29 వరకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్ తెలిపారు. హైదరాబాద్-తిరుపతి, నాగర్ సోల్, షిర్డీ, విశాఖ-తిరుపతి, కాకినాడపోర్టు-తిరుపతి, విజయవాడ-విశాఖ, విశాఖ-ధర్మవరం, తిరుపతి-నరసాపురం, నాందేడ్-పూణే మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడవనున్నాయన్నారు. వీటికి సంబంధించిన వివరాలు దక్షిణ మధ్య రైల్వే వెబ్ సైట్ లో లభ్యమవుతాయని, ఈ రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందని ఆయన చెప్పారు.

More Telugu News