రష్యా ఎంబసీపై రాకెట్లతో దాడి

13-10-2015 Tue 15:19

సిరియా రాజధాని డమాస్కస్ లో ఉన్న రష్యా రాయబార కార్యాలయంపై రాకెట్లతో దాడి జరిపారు. సిరియా తిరుగుబాటుదారులు రెండు రాకెట్లతో ఈ దాడికి పాల్పడ్డారు. తమ దేశ రక్షణ విషయంలో రష్యా కలుగజేసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతూ, వందలాది సిరియా ప్రభుత్వ మద్దతుదారులు ఈ ఉదయం రష్యా రాయబార కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలోనే తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించిందన్న వివరాలు తెలియరాలేదు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి రష్యా బలగాలు ఐఎస్ఐఎస్ స్థావరాలపై వైమానిక దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.