జపాన్ కంపెనీలు వెల్లువలా వస్తాయి: కంభంపాటి

13-10-2015 Tue 06:29

ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని శంకుస్థాపనపై జపాన్ పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు తెలిపారు. ఈ ఉదయం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాజధాని నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై జపాన్ లోని పారిశ్రామిక వేత్తలు ఆరాతీస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ క్రియాశీలతను ప్రశంసిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణం ప్రారంభమైన తరువాత కంపెనీలు వెల్లువలా వస్తాయని ఆయన తెలిపారు. రాజధాని నిర్మాణంలో ప్రజలను భాగస్వాములను చేయడంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయని ఆయన వెల్లడించారు.