శంకుస్థాపన కార్యక్రమానికి విశేష ప్రచారం... కృష్ణా- గుంటూరులో పలు కార్యక్రమాలు

12-10-2015 Mon 16:16

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమ ప్రచారం కోసం ఏపీ ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. కృష్ణా- గుంటూరు జిల్లాల్లో అమరావతి సంకల్ప జ్యోతి ర్యాలీలు నిర్వహిస్తారు. ఈ నెల 18న ప్రతి మునిసిపాలిటీ, ప్రతి మేజర్ పంచాయతీలో 2కే, 5కే రన్ లు నిర్వహిస్తారు. వాటితో పాటు సంఘీభావ ర్యాలీలు కూడా జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి రాజధాని గ్రామంలో కాగడాల ప్రదర్శన, కొవ్వొత్తులతో ర్యాలీలు, రాష్ట్ర వ్యాప్తంగా 160 ప్రసిద్ధ దేవాలయాలు, 50 చర్చిలు, 50 మసీదుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.