: బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం...నేడు సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర పండుగ నేడు ప్రారంభం అవుతోంది. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం నేడు తెలంగాణ సెలవు దినంగా ప్రకటించింది. బతుకమ్మ పండుగకు ఓ విశిష్టమైన ప్రత్యేకత ఉంది. ప్రతి పండుగ నాడు ఆయా దేవుళ్లను పూలతో పూజించడం సంప్రదాయం. కానీ, బతుకమ్మ పండుగలో పూలనే దేవుడిగా అలంకరించి, ఆరాధించడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఆటపాటలతో మహిళలు సందడి చేస్తారు. ఉత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను విడుదల చేసింది. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందులో నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొంటారు.

More Telugu News