: అగ్రదేశాల సరసన భారత్... నింగిలోకి విజయవంతంగా ఆస్ట్రోశాట్

అగ్రరాజ్యాల సరసన భారత్‌ నిలిచింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించిన 'ఆస్ట్రోశాట్' ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి చేర్చేందుకు బయలుదేరిన పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)-సి30 శ్రీహరికోటలోని షార్ ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి విజయవంతంగా ఎగసింది. విశ్వం మూలాలను తెలుసుకోడవంతో పాటు, రేడియేషన్, వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు దీనిని ఉపయోగించనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ తరహా ఉపగ్హాన్ని ఇప్పటివరకూ అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలు మాత్రమే ప్రయోగించాయి. సరిగ్గా ఉదయం 10 గంటలకు రాకెట్ బయలుదేరింది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన 1,513 కిలోల ఆస్ట్రోశాట్‌ తోపాటు, ఇండోనేషియా లాపాన్-2 (68 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్‌ యా (5.5 కిలోలు), యూఎస్‌కు సంబంధించిన లెమర్-2, 3, 4, 5 (ఒక్కొక్కటీ 16 కిలోలు) ఉపగ్రహాలను షార్ నింగిలోకి చేర్చనుంది.

More Telugu News