: జర్నలిస్టులకు ముచ్చెమటలు పట్టిస్తున్న రోబో

తాజాగా ఓ రోబో చైనా జర్నలిస్టులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. చైనాలో ప్రముఖ సోషల్ అండ్ గేమింగ్ సంస్థ 'టెన్సెంట్' నిన్న ఓ రోబోతో బిజినెస్ ఆర్టికల్ రాయించింది. 916 పదాలు గలిగిన ఆ ఆర్టికల్ ను రోబో రాసిందంటే ఎవరూ నమ్మడం లేదు. అచ్చం మనుషులు రాసినట్టే అద్భుతంగా రాసిందని దానిని చదివినవారు ప్రశంసిస్తున్నారు. ఇప్పటి వరకు అమెరికా, యూకేలలో మాత్రమే రోబోతో వార్తలు రాయించే వెసులుబాటు ఉండేదని, ఇప్పుడు చైనాకు కూడా అది అందుబాటులోకి వచ్చిందని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. 'డ్రీమ్ రైటర్' అనే ఈ రోబో ఆ వార్తను రాసేందుకు కేవలం ఒకే ఒక్క నిమిషం సమయం తీసుకుందని టెన్సెంట్ జర్నలిస్టు తెలిపారు.

More Telugu News