'ఫాస్ట్' పథకంపై పిటిషన్ దాఖలుకు అర్హతను ప్రశ్నించిన కోర్టు

04-08-2014 Mon 16:37

తెలంగాణ విద్యార్థులకే 'ఫాస్ట్' పథకాన్ని అమలు చేయడంపై ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో ఈ మధ్యాహ్నం విచారణ జరిగింది. ఫాస్ట్ తో ప్రభావితమయ్యే వారికే పిటిషన్ దాఖలుచేసే అర్హత ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులే పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొంది. అసలు ఈ పిటిషన్ దాఖలు చేసేందుకు మీకున్న అర్హత ఏంటని పితానిని న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ వివరణ కోరిన కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.