కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఏపీ మంత్రి రావెల

04-08-2014 Mon 10:47

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏపీ రాష్ట్ర మంత్రి రావెల కిశోర్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగానికి అతీతంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 1956 నిబంధన పేరుతో ప్రాంతీయ విద్వేషాలను మరింత రెచ్చగొట్టి... రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ భావిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ తన వ్యవహారశైలితో ఇరు ప్రాంత ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్నారని... తెలుగు ప్రజలకు ఇది మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఎంసెట్ కౌన్సిలింగ్ ఉమ్మడిగానే జరుగుతుందని అన్నారు.