: తప్పు నాదే: ఆండర్సన్

జడేజాతో తలెత్తిన వివాదంలో తప్పు తనదేనని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఎట్టకేలకు అంగీకరించాడు. పలు మలుపులు తిరిగిన ఈ వివాదంపై విచారణ చేపట్టిన ఐసీసీ ఇద్దరిదీ తప్పేమీ లేదని తేల్చిన సంగతి తెలిసిందే. అయితే ఐసీసీ తీర్పు వెలువడిన తర్వాత ఆండర్సన్ తన తప్పును అంగీకరించడం గమనార్హం. తొలి టెస్టు సందర్భంగా జడేజాను నెట్టివేయడంతో పాటు పళ్లు రాలగొడతానని దూషించానని ఆండర్సన్ చెప్పాడు. ఆ సందర్భంగా తాను కాస్త దురుసుగానే వ్యవహరించానని పశ్చాత్తాపం ప్రకటించాడు. జడేజా, ఆండర్సన్ ల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో జడేజాపై 50 శాతం మ్యాచ్ ఫీజులో కోత, ఆండర్సన్ పై రెండు టెస్టుల నిషేధం విధించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. జడేజా తప్పేమీ లేకున్నా, అతడి మ్యాచ్ ఫీజులో ఎందుకు కోత పెడతారంటూ టీమిండియా కెప్టెన్ ధోనీతో పాటు బీసీసీఐ కూడా ఘాటుగా స్పందించిన నేపథ్యంలో ఐసీసీ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించింది. దీంతో ఇరువురిపై ఎలాంటి చర్యలు లేకుండానే, ఇద్దరు ఆటగాళ్ల తప్పేమీ లేదని ప్రకటించింది.

More Telugu News