కిడ్నాప్ నకు గురైన వ్యాపారి తనయుడి హత్య

03-08-2014 Sun 11:57

పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో అపహరణకు గురైన వ్యాపారి కుమారుడిని కిడ్నాపర్లు హత్య చేశారు. మావోయిస్టులమంటూ వ్యాపారి కుమారుడు హరనాథ్ ను గత నెల 30న కొందరు దుండగులు అపహరించిన సంగతి తెలిసిందే. రూ. 10 లక్షలు ఇస్తే హరనాథ్ ను విడిచిపెడతామని చెప్పిన కిడ్నాపర్లు, బాధితుడి తండ్రి వద్ద డబ్బు కూడా తీసుకున్నారు. అయితే హరనాథ్ ను మాత్రం విడుదల చేయలేదు. ఐదు రోజులుగా పలు నాటకీయ మలుపులు తిరిగిన ఈ కిడ్నాప్ ఉదంతం చివరకు విషాదాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం వినాయకపురం అటవీ ప్రాంతంలో హరనాథ్ మృతదేహాన్ని పడేసినట్టు తెలుస్తోంది.