చందానగర్ పోలీసు తనిఖీల్లో 'ముంబై సూరి' అరెస్ట్

03-08-2014 Sun 11:29

దొంగలున్నారనే అనుమానంతో చందానగర్ లో పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో పేరుమోసిన నేరస్తుడు ముంబై సూరి అరెస్టయినట్టు సమాచారం. ఇతడిపై ముంబైలో ఐదు హత్య కేసులతో పాటు పలు దోపిడీ కేసులు కూడా ఉన్నాయి. నకిలీ నోట్ల చెలామణిలో భాగంగా కుదిరిన డీల్ వ్యవహారమై సూరి హైదరాబాద్ వచ్చినట్లు సమాచారం. అంతేకాక శుక్రవారం జరిగిన కాల్పుల్లో ఒకడు మృతి చెందాడని భావిస్తున్న పోలీసులు, మిగిలిన వారిని పట్టుకునేందుకు చందానగర్ పై మూకుమ్మడి దాడులు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన సోదాల్లో 30 మంది దాకా అనుమానిత వ్యక్తులు పట్టుబడ్డారని, వారిలో ముంబై సూరి కూడా ఉన్నాడని చెబుతున్నారు. అయితే పోలీసు అధికారులెవరూ దీనిని ధృవీకరించలేదు.