రాజమండ్రి సెంట్రల్ జైలులో సెల్ ఫోన్లు, నగదు

03-08-2014 Sun 10:54

రాజమండ్రి సెంట్రల్ జైలు లోపలికి సెల్ ఫోన్లతో పాటు భారీ మొత్తంలో నగదు ప్రవేశించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు కేటాయించిన స్నేహ బ్లాకులో మూడు సెల్ ఫోన్లతో పాటు రూ 78 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే కేంద్ర కారాగారంలోనే ఖైదీలు గుట్టుచప్పుడు కాకుండా మొబైళ్ల ద్వారా తమ కార్యకలాపాలను చక్కబెట్టుకుంటున్న వైనంపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.