: శ్రీశైలం జలాశయానికి వరద ఉద్ధృతి

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నదిలో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంది. జలాశయంలోకి వచ్చి చేరుతున్న వరద నీటికంటే దిగువకు వదులుతున్న నీటి పరిమాణం తక్కువగా ఉన్న నేపథ్యంలో క్షణక్షణానికి జలాశయంలో నీటి మట్టం పెరిగిపోతోంది. శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ఇప్పటికే 850 అడుగులకు పైగా నీరు చేరిపోయింది. దిగువకు వదిలే నీటి పరిమాణాన్ని పెంచని పక్షంలో పోతిరెడ్డిపాడు పరిసర ప్రాంతాలు జలమయమయ్యే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే తుంగభద్రను ముంచెత్తిన వరద నీరు, కర్నూలు సమీపంలోని తుంగభద్ర బ్రిడ్జిపై నుంచి పారుతోంది. దీంతో రవాణావ్యవస్థ పూర్తిగా స్తంభించింది. నష్టనివారణ చర్యలు తీసుకోని పక్షంలో గతంలోలా కర్నూలును వరద నీరు ముంచెత్తే ప్రమాదం లేకపోలేదు. గతానుభవాల నేపథ్యంలో ప్రస్తుతం కర్నూలు వాసులు ప్రాణాలరచేత పట్టుకుని కూర్చున్నారు.

More Telugu News