: నేటి నుంచి మోడీ నేపాల్ పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు నేపాల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా నేపాల్ కు అత్యంత ప్రధానమైన విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఇరు దేశాల ప్రధానులు సంతకాలు చేసే అవకాశాలున్నాయి. ఇఫ్పటికే దీనిపై నేపాల్ ప్రభుత్వం పూర్తి స్థాయి కసరత్తు చేసిందనే చెప్పాలి. నేపాల్ లోని మెజార్టీ ప్రాంతాలు, గంటల పాటు కొనసాగుతున్నవిద్యుత్ కోతలతో సతమతమవుతున్నాయి. అందుకే, ఈ ప్రాంతాల్లో విద్యుత్ కొరతను నివారించేందుకు నేపాల్, భారత్ నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అంతేకాక సదరు ఒప్పందాల ప్రతులను కూడా ఇప్పటికే ఆ దేశ విదేశాంగ శాఖ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇంత కీలకమైన సమయంలో బీజేపీ సర్కారు, అంత దూరం వెళ్లి ఒప్పందాలపై సంతకాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న విద్యుత్తుతో లోటును భర్తీ చేసుకోవడం మాని, ఇతర దేశాలకు అమ్మేస్తే ఎలాగంటూ కొన్ని వర్గాల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలను మోడీ పట్టించుకోవడం లేదు.

More Telugu News