బాడ్మింటన్ లో తెలుగు తేజాలకు కాంస్య పతకాలు

03-08-2014 Sun 06:54

కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతుండగా, తాజాగా తెలుగు తేజాలు సింధూ, గురుసాయి దత్ లు కూడా ప్రతాపం చూపారు. శనివారం నాటి క్రీడల్లో భాగంగా బాడ్మింటన్ లో సింధూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. తన ప్రత్యర్థిపై 23-21, 23-9 తేడాతో విజయం సాధించి తన సత్తాను చాటిన సింధూ కాంస్య పతకాన్ని సాధించింది. మరోవైపు హైదరాబాద్ కు చెందిన గురుసాయి దత్ కూడా బాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించాడు.