రెండు రాష్ట్రాలకు 2 వేల సోలార్ పంపు సెట్లు మంజూరు

01-08-2014 Fri 20:06

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం 2 వేల సోలార్ పంపుసెట్లను మంజూరు చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా 58 శాతం కాగా, తెలంగాణ రాష్ట్రానిది 42 శాతం. 2015 జూన్ లోపు రైతు పొలాల్లో సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సోలార్ పంపు సెట్ల కోసం రాయితీగా కేంద్ర సాంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ 27 కోట్ల 36 లక్షల రూపాయల నిధులను సమకూరుస్తుంది.