: అఫ్జల్ గురును 'షాహిబ్'గా సంబోధించిన ఒమర్ అబ్దుల్లా

పార్లమెంటు దాడి నిందితుడు అఫ్జల్ గురు ఉరితీతపై జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. భారత్ ప్రభుత్వం అఫ్జల్ కు ఉరి శిక్ష అమలు చేయడంపై ఆ రాష్ట్ర అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కాగా, ఈ రోజు సభలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా .. అఫ్జల్ గురును 'షాహిబ్' అంటూ పిలిచారు.

'షాహిబ్' అనే పదాన్ని ఓ వ్యక్తికి గౌరవం ఇచ్చేందుకు ఉపయోగిస్తారు. ఒమర్, గురును రక్షించడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, గురుకు మరణ శిక్ష విధించిన సమయంలో కాశ్మీర్ లోయలో పరిస్థితిని సమర్ధవంతంగా ఎదర్కొన్నామని ఒమర్ చెప్పారు. కానీ, గురుని ఉరితీయడం రాజకీయమని విమర్శించారు. 

More Telugu News