దొంగలపై విషాన్ని వెదజల్లిన ఆదిశేషుడు

దైవం ఆవిర్భవించిన క్షేత్రాల్లో అనేక మహిమలు వినిపిస్తూ ఉంటాయి ..  మరెన్నో మహిమలు అనుభవంలోకి వస్తుంటాయి. అలాంటి సంఘటనల వలన ఆ క్షేత్రం యొక్క విశిష్టత పెరుగుతూ వెళుతుంటుంది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా 'తిరుమయం' కనిపిస్తుంది. 108 దివ్య తిరుపతులలో ఈ క్షేత్రం ఒకటిగా దర్శనమిస్తూ ఉంటుంది.

ఇక్కడి స్వామివారు సత్యగిరినాథుడు .. అమ్మవారు ఉయ్యవందాల్ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు. సత్యదేవతకు స్వామి ప్రత్యక్షమైన కారణంగా ఈ క్షేత్రాన్ని సత్యవ్రత క్షేత్రమని పిలుస్తారు. ఇక్కడి తీర్థాలలో ఒకటి 'సత్య తీర్థం' పేరుతోనే పిలవబడుతూ ఉంటుంది. చాలా కాలం క్రితం ఒకనాటి రాత్రి ఆలయంలోని స్వామివారి మూర్తిని అపహరించడానికి దొంగలు వచ్చారట. స్వామివారి విగ్రహాన్ని తాకడానికి వాళ్లు ప్రయత్నిస్తుండగా, ఒక్కసారిగా ఆదిశేషువు నిజ రూపాన్ని ధరించి, ఆ దొంగలపై విషాన్ని వెదజల్లినట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే స్వామివారు ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనేది భక్తుల విశ్వాసం.


More Bhakti News