చైతన్య మహా ప్రభువుగా మారిన గౌరాంగదేవుడు

శ్రీకృష్ణుడిని ఆరాధిస్తూ .. ఆయన సేవలో తరించిన భక్తులలో ఒకరిగా నిమాయి కనిపిస్తాడు. నిమాయి అసలు పేరు గౌరాంగదేవుడు. పండిత జగన్నాథ మిశ్రా .. శచీదేవి దంపతులకు ఆయన జన్మించాడు. ఆ దంపతులు ఆయనకి పెట్టుకున్న ముద్దు పేరే నిమాయి. ఒకసారి ఆయన 'గయ'కు వెళ్లినపుడు శ్రీమన్నారాయణుడి చరణ చిహ్నాలను చూడగానే ఆయన బాహ్య స్మృతిని కోల్పోయాడు.

ఆ సమయంలో ఆయన చెంతనే వుండి, ఆయన తిరిగి ఈ లోకంలోకి రావడానికి ప్రయత్నించిన మహనీయుడే ఈశ్వరపురి. భగవంతుడి సాన్నిధ్యం కోసం తహ తహలాడుతున్న గౌరాంగుడుకి దశాక్షర శ్రీ కృష్ణ మంత్రాన్ని ఈశ్వరపురి ఉపదేశించాడు. ఆ క్షణం నుంచి గౌరాంగ దేవుడి జీవితమే మారిపోయింది. ఆయనకి అంతటా కృష్ణ చైతన్యమే గోచరించడం మొదలైంది. కాలక్రమంలో ఆయనే చైతన్య ప్రభువుగా మారాడు. ఆయన స్నేహితుడైన నిత్యానందుడు కూడా కృష్ణభక్తి మార్గాన్నే అనుసరించి నితాయిగా ప్రసిద్ధి చెందాడు.


More Bhakti News