వేదాంత దేశికులవారు గరుడ దండకం రాసింది ఇక్కడే

'గరుడ దండకం' ఎంతో శక్తిమంతమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాంటి గరుడ దండకాన్ని వేదాంత దేశికులవారు రచించారు. 108 దివ్య తిరుపతులలో ఒకటిగా చెప్పబడే 'తిరువహీంద్ర పురం' అనే క్షేత్రంలో ఆయన గరుడ దండకాన్ని రచించారు. ఈ క్షేత్రం 'కడలూరు'కి సమీపంలో వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారు 'తైవ నాయక' .. అమ్మవారు 'వైకుంఠనాయకి' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటారు.

గరుడ .. పెన్నా .. సేవై అనే ఇక్కడి మూడు తీర్థాలు పరమ పవిత్రమైనవిగా చెబుతారు. ఈ కొండపైనే వేదాంత దేశికులవారు గరుత్మంతుడిని .. హయగ్రీవుడని ఆరాధించారు. ఇక్కడే ఆయన వారి సాక్షాత్కారాన్ని పొందారు. ఆ సమయంలోనే ఆయన 'గరుడ దండకం' .. 'హయగ్రీవ స్తోత్రం' రచించారు. ఆధ్యాత్మిక పరంగా ఈ రెండు అత్యంత ప్రత్యేకతను .. ప్రాధాన్యతను సంతరించుకుని, పఠించినవారిని ఒక కవచంలా రక్షిస్తూ ఉండటం విశేషం.  


More Bhakti News