సూర్యారాధన ఫలితం

సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా భావించడమనేది ప్రాచీన కాలం నుంచి వుంది. సమస్త ప్రకృతి నుంచి సకల జీవరాశికి ఆహారాన్ని అందించేది ఆ స్వామియే అనేది మహర్షుల మాట. అందువల్లనే సూర్య భగవానుడికి నమస్కరించి ఆ స్వామికి కృతజ్ఞతలు తెలియజేయడమనేది అనాది కాలం నుంచి వుంది. సూర్య భగవానుడికి నమస్కరించకుండా చేసే పూజలు కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వవనేది పెద్దల మాట.

సూర్యభగవానుడి రథానికి ఒకే అశ్వం ఉంటుందనీ, దాని పేరే 'సప్త' అని అంటారు. ఆ రథానికి ఒకే చక్రం ఉంటుందనీ, అదే కాల చక్రం అని చెబుతారు. ఆ చక్రానికి గల 12 ఆకులే మాసాలని అంటారు. అలాంటి సూర్యభగవానుడు ఒక్కో రాశిలోకి ప్రవేశించినప్పుడు ఒక్కో పేరుతో పిలవబడుతుంటాడు. సూర్యభగవానుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగిపోయి, ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయి. సకల జీవరాశులకు పోషకుడైన సూర్యభగవానుడిని పూజించడం మరిచిపోకూడదని  మహర్షులు సెలవిచ్చారు.      


More Bhakti News