భక్తులను అనుగ్రహించే సమ్మక్క .. సారక్క

తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతి పెద్ద జాతరలలో 'సమ్మక్క సారక్క' జాతర ఒకటి. 'మేడారం' అడవుల్లో మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇక్కడి 'జంపన్న' వాగులో స్నానాలు ఆచరించిన భక్తులు, తమ మనసులోని ధర్మబద్ధమైన కోరికలను అమ్మవార్లతో చెప్పుకుంటారు.

ఒక కోయదొర అడవిలో అన్వేషించి కుంకుమ భరిణ రూపంలోని అమ్మవార్లను కనుగొంటాడు. ఒక కుంకుమ భరిణను సమ్మక్కకి ప్రతీకగా .. మరో కుంకుమ భరిణను సారక్కకి ప్రతీకగా భావిస్తారు. మొదటి రోజున సమ్మక్క 'గద్దె'పైకి రాగా, రెండవ రోజున సారక్క 'గద్దె'పైకి వస్తుంది. సమ్మక్క సారక్క దర్శనం వలన సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. సంతాన సౌభాగ్యాలను అమ్మవార్లు అనుగ్రహిస్తుంటారని చెబుతారు. కోరికలు నెరవేరిన భక్తులు మొక్కుబడిగా బంగారం (బెల్లం) సమర్పించుకుంటారు. నాలుగు రోజుల పాటు కోలాహాలంగా జరిగే ఈ జాతర వెనుక ఒక చారిత్రక కథనం వినిపిస్తూ ఉంటుంది.


More Bhakti News