'ర్యాలీ' జగన్మోహిని కేశవస్వామి పాదాల చెంత గంగ

 శివ కేశవులు వెలసిన పరమ పవిత్రమైన క్షేత్రాలలో 'ర్యాలీ' జగన్మోహిని కేశవస్వామి క్షేత్రం ఒకటిగా కనిపిస్తుంది. రావులపాలెం సమీపంలో మహిమాన్వితమైన ఈ క్షేత్రం అలరారుతోంది. ఇక్కడ ఒకే ప్రతిమలో ముందువైపున కేశవస్వామి .. వెనుక భాగంలో జగన్మోహిని దర్శనమిస్తారు. గర్భాలయంలోని ఈ మూర్తిని తీర్చిదిద్దిన తీరు ఆశ్చర్యచకితులను చేస్తుంది. స్వామివారి సౌందర్యం చూసితీరవలసిందే.

శివుడికి జగన్మోహినిగా శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చిన ప్రదేశం ఇదేనని స్థలపురాణం చెబుతోంది. ఇక్కడ స్వామివారి పాదాల చెంత 'గంగ' నిరంతరం ఉబికి వస్తుండటం విశేషం. ఇదే ప్రాంగణంలో ' ఉమాకమండలేశ్వరస్వామి'గా పరమశివుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి శివలింగం రుద్రాక్ష మాదిరిగా గరుకుగా కనిపిస్తుంది. పానవట్టం భిన్నంగా ఉండటం కూడా ఆశ్చర్యపరుస్తుంది. స్వామివారికి అభిషేకం చేసిన నీరు బయటికి రాదు .. ఆ నీరు ఏమైపోతుందనే విషయం ఎవరికీ అంతుబట్టదు. ఇలా ఈ క్షేత్రం మహిమల సమాహారంగా మనసు దోచుకుంటుంది.


More Bhakti News