కుష్ఠు వ్యాధిని తొలగించిన సోమేశ్వరుడు

మహాశివుడి లీలావిశేషాలు అన్నీ ఇన్నీ కావు. భక్తులను ఆదుకోవడానికి .. అనుగ్రహించడానికి ఆయన ఎన్నో మహిమలు చూపాడు. అలాంటి సదాశివుడు కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా 'సోమారం' కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి స్వామివారికి 'భృగుమాలిక సోమేశ్వరుడు' అని పేరు. భృగు మహర్షి జపమాలలోని రుద్రాక్ష నుంచి స్వామివారు ఆవిర్భవించాడని స్థలపురాణం చెబుతోంది.

కాకతీయుల కాలంలో స్థానిక అధికారి కుమారుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉండేవాడట. తనకి ఆలయాన్ని నిర్మిస్తే ఆయన కుమారుడి కుష్ఠు వ్యాధిని నివారిస్తానని ఆ అధికారికి కలలో కనిపించి శివుడు చెప్పాడట. దాంతో ఆ అధికారి ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ఆలయ నిర్మాణం పూర్తవుతుండగా, ఆ అధికారి దగ్గరికి ఆయన కుమారుడు వచ్చాడట. అతని కుష్టువ్యాధి పూర్తిగా నయమైపోవడం చూసి ఆ అధికారి ఆనందంతో పొంగిపోయాడట. ఈ మహిమ కారణంగానే వివిధ రకాల వ్యాధులతో బాధలుపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేసుకుంటూ వుంటారు.        


More Bhakti News