పూజల్లో పుణ్యం

భారత దేశంపై ఆధ్యాత్మిక ప్రభావం అధికంగా కనిపిస్తూ వుంటుంది. పూజలు ... వ్రతాలు ... నోములు ... పండుగలు ... ఇలా ప్రతి అంశం ఆధ్యాత్మికతతో ముడిపడి వుంటుంది. ప్రతి శుభకార్యంలోను తొలి ప్రాదాన్యత దేవుడికే ఇస్తూ పూజాది కార్యక్రమాలను నిర్వహించడం మనకు అనాదిగా వస్తోంది. ఇక దేవుడు ఒక్కడే అయినా ఆయనను అనేక రూపాలలో పిలుచుకోవడం ... కొలుచుకోవడం కూడా తరతరాలుగా వస్తున్నదే. ఎవరి ఇష్ట దైవానికి వారు పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రశాంతతను ... సంతోషాన్ని ... సంతృప్తిని పొందుతూ వుంటారు.

దైవం ఏదైనా ... ఆ దైవాలను స్తుతించే మంత్రాలు వేరైనా ... పూజా విధానంలో ఇంచుమించు ఒకే సంప్రదాయాన్ని అనుసరిస్తూ వుండటం జరుగుతూ వుంటుంది. ఆచమనం ... కలశ స్థాపన ... ప్రాణప్రతిష్ఠ ... ధ్యానం ... షోడశోపచార పూజ ... ధూపం ... దీపం ... నేవేద్యం ... తాంబూలం ... నీరాజనం ... ఆత్మ ప్రదక్షిణం ... సాష్టాంగ నమస్కారం ... సర్వ సాధారణంగా పూజా విధానంలో కనిపిస్తూ వుంటాయి.

అయితే సమయాభావం కారణంగానో ... సమస్యల కారణంగానో ఇదంతా మనం యాంత్రికంగా చేసేయడం జరుగుతూ వుంటుంది. అలా కాకుండా పూజా విధానంలో ఈ పద్ధతులను ఎందుకు పాటించాలి? ... వీటి వెనుకగల అర్ధాలు ... పరమార్ధాలు ఏవిటి? అనే విషయం తెలుసుకుంటే, ఆచరించిన పూజ వలన మరింత సంతృప్తి ... సార్ధకత లభించినట్టు అనిపిస్తుంది. అందువలన ఇష్ట దైవాలకు జరిపే పూజలు ... పద్దతిగా జరిపే ఆ పూజల వెనుక గల పరమార్ధాలు ... పూజలకు సంబంధించిన విషయాల్లో శాస్త్రం సూచించిన నియమాలను గురించి తెలుసుకుందాం ...


More Bhakti News