సౌభాగ్యలక్ష్మీ వ్రతం

వ్రతాలన్నింటిలోకి 'సౌభాగ్య లక్ష్మీ వ్రతం' ఎంతో మహోన్నతమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి గోమాత ముఖానికి ... పాదాలకి పసుపురాసి బొట్లు పెట్టాలి. గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి. వ్రతదీక్ష తీసుకొనువారు వ్రతానికి ముందు రోజు ... తరువాతి రోజు పండ్లు - పాలు మాత్రమే స్వీకరించాలి.

ఈ వ్రతం చేసే వారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కటిక నేలపై నిద్రించాల్సి వుంటుంది. ఎర్ర చీరను ... ఆకుపచ్చ జాకెట్టును అమ్మవారి దగ్గర వుంచి ఆ తరువాత ధరించాలి. చేతికి తోరం కట్టుకుని అమ్మవారి పంచలోహ విగ్రహము గానీ, రాగి విగ్రహము గాని పసుపునీటితో పరిశుభ్రపరచాలి. దానిని రాగి పళ్లెంలో పెట్టి పూజామందిరంలో ఉంచాలి. సాయంత్రం తులసి కోట దగ్గర ... ప్రధాన గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించి పూజను ప్రారంభించాలి.

అమ్మవారికి పంచామృత అభిషేకంతో సహా శాస్త్రోక్తంగా పూజను నిర్వహించాలి. ఆ తరువాత అమ్మవారి పేరిట ఓ ముత్తయిదువును పిలిచి భోజనం పెట్టి ఆమె ఆశీస్సులు తీసుకోవాలి. ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సౌభాగ్యంతో పాటుగా సకలసంపదలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.


More Bhakti News