పుట్టుమచ్చలు (నాలుక - పెదవులు)

'పై పెదవిపై' పుట్టుమచ్చ వున్న వారు అందరితోను కలుపుగోలుగా వుంటారు. వీరు ఎక్కడ వుంటే అక్కడ సందడి ...హడావిడి వుంటాయి. అందరితోను కలివిడిగా మంచి విషయాలను మాత్రమే మాట్లాడుతూ, శుభ కార్యాలు జరగడానికి కారకులవుతుంటారు. అందంగా వుండటంకోసం పడే ఆరాటం ... ఇతరులను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నాలుచేసే లక్ష ణాలు వీరిలో కనిపిస్తుంటాయి. ఈ పుట్టుమచ్చగల స్త్రీలలో దైవభక్తి అధికంగా వుంటుంది. బంధుమిత్రుల పట్ల వీరు ఎంతో ప్రేమానురాగాలను ప్రదర్శిస్తూ వుంటారు. వీరు తమ తెలివి తేటలతోను ... మాటకారితనంతోను అందరినీ ఆకట్టుకుంటారు.

ఇక 'నాలుక కింది పెదవిపై' పుట్టుమచ్చ వున్న వారు... మంచి మాటకారులై వుంటారు. వీరు ఏదో ఓ కళలో రాణిస్తారు. ముఖ్యంగా నాటక రంగంలో ఆసక్తి అధికంగా వుండి నటుడిగా పేరు ప్రతిష్ఠలు సంపాదించుకునే అవకాశాలు వున్నాయి. ఆస్తి పాస్తులు పెద్దగా లేకపోయినా, తమలోని కళను నమ్ముకునే వీరు కాలక్షేపం చేస్తుంటారు.

ఇక ఈ పుట్టుమచ్చ స్త్రీలలో చెంచల స్వభావాన్ని తెలుపుతుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులతో గొడవలు పడుతూ వుంటారు. పై పెదవి లోపల వుండే పుట్టుమచ్చ వల్ల మంత్రాలపై పట్టు వుంటుంది. ఇక కింది పెదవి లోపలి భాగంలో వుంటే ... మద్యానికి బానిసయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ కారణంగా సమాజంలో వీరు చిన్న చూపు చూడబడతారు.

ఇక 'నాలుక చివర' పుట్టుమచ్చ ఉన్న వారు సంగీత ... సాహిత్యాల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. మంచి ప్రతిభాపాటవాలు కలిగి, విషయమేదైనా వాదనలో అవతలివారిని మెప్పించ గలుగుతారు. మంచి సంపాదనతో భోగ భాగ్యాలను అనుభవిస్తూ, సమాజంలో కావలసినంత గౌరవ మర్యాదలను పొందుతుంటారు. ఇక 'నాలుక కింద' పుట్టుమచ్చ వుంటే ... పై ఫలితాలకు భిన్నంగా వీరి జీవితం వుంటుంది.

'నాలుక పై' పుట్టుమచ్చ గల స్త్రీలు సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తిని ... అభిరుచిని కలిగి వుంటారు. దైవ సంబంధమైన కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీరు తమ ఇంటిని సంగీత సాహిత్యాలు కొలువుదీరిన దేవాలయంలా తీర్చిదిద్దుకుంటారు.


More Bhakti News