లక్ష్మీ వల్లభ క్షేత్రం
వేంకటేశ్వరుడు అంటేనే కష్టాలను నశింపజేసేవాడని అంటారు. కొండంత కష్టంలో తనని ఆరాధిస్తే, ఆ కష్టాన్ని కొవ్వొత్తిలా కరిగించివేస్తాడని చెబుతారు. ఆపదలను తొలగించినా ... ఆనందాలను ప్రసాదించినా అది ఆయనకే సాధ్యం. అందుకే ఆయనని దర్శించుకోవాలనీ ... తమ కోరికలను విన్నవించుకోవాలని అంతా ఆతృత పడుతుంటారు. తమ కన్నీళ్లు తుడిచిన ఆ కోనేటిరాయుడికి మొక్కుబడులు చెల్లించాలని ఆరాటపడుతుంటారు.
ఈ నేపథ్యంలో తిరుమల వరకూ వెళ్లలేని భక్తుల కోసం స్వామి వివిధ ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా కృష్ణా జిల్లాలోని 'రాపర్ల' దర్శనమిస్తుంది. ఇక్కడి గర్భాలయంలో వేంకటేశ్వరుడు ఎత్తులోను ... సౌందర్యంలోను తిరుమల బాలాజీని తలపిస్తుంటాడు. మనోహరమైన ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మనసులో ప్రతిష్ఠించుకోవడానికే భక్తులు అధిక సంఖ్యలో ఈ క్షేత్రానికి వస్తుంటారు.
స్వామివారికి 11 ప్రదక్షిణలు చేస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయని అంటారు. హనుమంతుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో గణపతి ... నవగ్రహాలు ... నాగదేవత ... భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి పూజలు అందుకుంటూ వుంటారు. ఇక్కడి మల్లికార్జునుడుకి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నట్టుగా స్థలపురాణం చెబుతోంది.
సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన వారు నాలుగు సోమవారాల పాటు ఆయనకి అభిషేకం చేయించి మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు. ప్రతియేటా ఇటు లక్ష్మీ శ్రీనివాసులకి ... అటు భ్రమరాంబ మల్లికార్జునులకు కళ్యాణోత్సవాలు ఘనంగా జరుపుతుంటారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని హరిహరుల అనుగ్రహానికి పాత్రులవుతుంటారు.