నామాలు వెలసిన క్షేత్రం
వైకుంఠనాథుడైన శ్రీ మహావిష్ణువు మహర్షుల కోరికమేరకు తిరుమలలో శ్రీనివాసుడుగా ఆవిర్భవించాడు. అలాంటి శ్రీనివాసుడే తన భక్తుల అభ్యర్ధనమేరకు అనేక ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరుడుగా వెలిశాడు. స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలను పరిశీలిస్తే, వివిధ భంగిమలలో ఆయన రూపాలు దర్శనమిస్తుంటాయి.
అయితే స్వామివారు 'తిరునామం'గా వెలసిన క్షేత్రాలు మాత్రం బహు అరుదుగానే ఉంటాయని చెప్పుకోవాలి. అలా స్వామివారు 'తిరునామం' ఆకారంలో ఆవిర్భవించిన క్షేత్రంగా ఖమ్మం జిల్లా 'నేలకొండపల్లి' దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి కొండపై గల గుహలో స్వామివారు 'తిరునామం' రూపంలో కనిపిస్తూ వుంటాడు.
మహిమాన్వితుడైన ఇక్కడి వేంకటేశ్వరస్వామికి వందల సంవత్సరాల చరిత్ర వుంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఒక భక్తుడు కుష్టువ్యాధి నుంచి బయటపడటం కోసం స్వామివారి గురించి ఈ కొండపై ధ్యానం చేసుకోసాగాడు. కలలో ఆయనకి స్వామి కనిపించి ఇక్కడి గుహలో వెలసినట్టు చెప్పాడు. మరునాడు ఆయన స్వామివారి రూపాన్ని గురించి కొండ అంతటా వెదకగా, గుహలో ఓ మూల నామాల రూపంలో స్వామి కనిపించాడు. స్వామిని ఆయన నిరంతరం పూజిస్తూ వుండటం వలన కుష్టువ్యాధి తగ్గిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి ఆలయం నిర్మించి ఇలవేల్పుగా పూజించడం ప్రారంభించారు. ఇక ఇదే ప్రాంగణంలో పద్మావతి అమ్మవారు ... శివుడు ... సంతాన వేణుగోపాలుడు ... హనుమంతుడు పూజలు అందుకుంటూ వుంటారు. ఆనాటి వైభవాన్ని ఆవిష్కరిస్తోన్న ఈ ఆలయాన్ని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు ... సమస్త వ్యాధుల బారి నుంచి విముక్తిని పొందుతుంటారు.